చంద్రబాబు: చంద్రబాబు గారూ! ఒక్క మీ సామాజిక వర్గంలోనే కాదు, అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపండి: ముద్రగడ

  • చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ
  • కులాలతో రాజకీయం చేయడం మొదలు పెట్టింది చంద్రబాబే
  • ఇతరులపై ఆరోపణలు చేయడం బాబుకు అలవాటైపోయింది

కులాలతో రాజకీయం చేయడం మొదలుపెట్టింది చంద్రబాబునాయుడేనని, ఒక్క మీ సామాజిక వర్గం బలపడటమే కాదు, అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని కోరుతున్నానని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు.

ఇతరులపై అన్యాయంగా ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటైందని, తమపై ఎన్నో ఆరోపణలు చేశారని, ఒక్కటీ రుజువు చేయలేదని ఆ లేఖలో విమర్శించారు. 'తమరు ఎన్ని సభలైనా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ, మేం చేసుకోకూడదా? ఎన్నికల హామీని అమలు చేయాలని మా జాతి కోరుకోకూడదా?' అని ఆ లేఖలో ముద్రగడ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News