ఒబామా: నాకు సెల్ఫీలు నచ్చవు..ఇప్పటికీ సెల్ఫీ స్టిక్ లతో నా వద్దకు వస్తున్నారు: ఒబామా
- అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు
- ఫోటోలు తీసుకుంటూ వుంటే విభేదాలు రావచ్చు
- తన అనుచరులకు క్లాస్ పీకిన ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీలంటే తనకు ఇష్టం ఉండదని, అందుకు గల కారణాన్ని ఆయన చెప్పారు. షికాగోలో ఇటీవల జరిగిన ఒబామా ఫౌండేషన్ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న సందర్భంలో ఆయన అనుచరులు సెల్ఫీ దిగుదామని అడిగారు. ఈ సందర్భంగా ఒబామా వారితో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నేను అధ్యక్షుడిని అయినప్పుడు ప్రజలు నేరుగా నా కళ్లలోకి చూడలేదు.. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు కానీ, నా వద్దకు వచ్చే ముందు సెల్ఫీ స్టిక్ లతో వచ్చేవారు. ఇప్పటికీ పరిస్థితి మారలేదు. ఓ వ్యక్తి మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఫొటోలు తీసుకుంటూ, సోషల్ మీడియాలో బిజీగా ఉంటే కనుక ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అలా అని చెప్పి నేను సోషల్ మీడియాను తప్పుబట్టట్లేదు" అన్నారు ఒబామా.