కాంగ్రెస్: కాంగ్రెస్ కోసమో, టీఆర్ఎస్ కోసమో టీడీపీ పుట్టలేదు: రావుల చంద్రశేఖరరెడ్డి

  • తెలంగాణలో మైండ్ గేమ్ నడుస్తోంది
  • తెలుగుజాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందన్న రావుల
  • చంద్రబాబు హయాంలో అన్ని కులాలకు న్యాయం జరిగింది
  • టీఆర్ఎస్ హయాంలో సామాజిక న్యాయం కొరవడింది: మోత్కుపల్లి

కాంగ్రెస్ కోసమో, టీఆర్ఎస్ కోసమో టీడీపీ పుట్టలేదని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖరరడ్డి, మోత్కుపల్లి నరసింహులు, సండ్ర వెంకట వీరయ్య, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

అనంతరం మీడియాతో రావుల మాట్లాడుతూ, తెలంగాణలో మైండ్ గేమ్ నడుస్తోందని తెలుగుజాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని అన్నారు. అనంతరం, మోత్కుపల్లి మాట్లాడుతూ, బలహీనవర్గాలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించింది ఎన్టీఆరేనని, ‘పేదోడికి ఇల్లు’ అనే సిద్ధాంతం ఎన్టీఆర్ దేనని, చంద్రబాబు హయాంలో అన్ని కులాలకు న్యాయం జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం కొరవడిందని విమర్శించారు. మరో నేత అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ క్యాడర్ కు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని, తమతో పొత్తు వల్లే హైదరాబాద్ లో బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయని అన్నారు.

  • Loading...

More Telugu News