టీజీ వెంకటేష్: పాదయాత్రతో జగన్ కు నష్టమే తప్పా లాభం ఉండదు: ఎంపీ టీజీ వెంకటేష్
- జగన్ పై విమర్శలు గుప్పించిన టీజీ
- నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి బయటపడేందుకే పాదయాత్ర
- ఏపీకి రెండో రాజధానిగా కర్నూలును చేయాలన్న టీడీపీ నేత
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్రతో జగన్ కు నష్టమే తప్పా లాభం ఉండదని అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జగన్ ఆ బాధ నుంచి బయటపడాలన్న తాపత్రయంతోనే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని అనుకోవడం వైసీపీకి తగదని, ఏపీకి రెండో రాజధానిగా కర్నూలును చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.