పరుచూరి గోపాలకృష్ణ: నేను, అన్నయ్య ఆస్ట్రేలియా వెళుతున్నాం: పరుచూరి గోపాలకృష్ణ

  • తెలుగు సంఘం ఆహ్వానం మేరకు వెళుతున్నాం
  • 7వ తారీఖున తిరిగి వస్తాం
  • ఈలోపు ‘ట్విట్టర్’, ‘ఫేస్ బుక్’ ద్వారా పలుకరించలేను
  • ఓ వీడియోను పోస్ట్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ 

‘నేను, అన్నయ్య ఈరోజు ఆస్ట్రేలియా దేశం వెళుతున్నాం’ అని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పరుచూరి తన ట్విట్టర్ ఖాతాలో ఈరోజు ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో నన్ను అనుసరిస్తున్న వారందరికీ నమస్కారం. నేను, అన్నయ్య ఈరోజు ఆస్ట్రేలియా దేశానికి వెళుతున్నాం. సిడ్నీ, మెల్ బోర్న్ లోని తెలుగు సంఘం వారు మమ్మల్ని ముఖ్యఅతిథులుగా పిలిచారు. తెలుగుభాష ఔన్నత్యం గురించి మాట్లాడమన్నారు.

ప్రవాస భారతీయులతో, మన తెలుగు వారితో కలిసి నాలుగు రోజులు ఉండేందుకు వెళుతున్నాం. తిరిగి 7వ తారీఖున వస్తాం. ఈలోపు ట్విట్టర్, ఫేస్ బుక్ లో మిమ్మల్ని పలుకరించే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి, నన్ను అర్థం చేసుకోండి! తిరిగి 7వ తారీఖున ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పనిసరిగా మిమ్మల్ని కలుస్తాను’ అని ఆ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కాగా, ప్రతి మంగళవారం ‘పరుచూరి పలుకులు’, ప్రతి శుక్రవారం ‘పరుచూరి పాఠాలు’ను ‘ఫేస్ బుక్’, ‘ట్విట్టర్’ ఖాతాల ద్వారా గోపాలకృష్ణ అందిస్తున్న విషయం తెలిసిందే.  

  • Loading...

More Telugu News