చలసాని శ్రీనివాస్: ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపిస్తోంది: చలసాని శ్రీనివాస్
- ఎన్టీఆర్ స్ఫూర్తితో కేంద్రంపై చంద్రబాబు పోరాడాలి
- దేశ సంపదను గుజరాత్ కు తరలిస్తున్న మోదీ
- ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్
ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపిస్తోందని ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్ఫూర్తితో కేంద్రంపై చంద్రబాబు పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ సంపదను గుజరాత్ కు మోదీ తరలిస్తున్నారని, ప్రత్యేకహోదాపై పోరాటానికి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆయన కోరారు.