జగన్: పాదయాత్రకు భద్రత కల్పించండి... ఏపీ డీజీపీకి వైసీపీ లేఖ
- 6 నుంచి పాదయాత్ర ప్రారంభం
- జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ అందజేస్తాం
- సుమారు ఏడు నెలల పాటు సాగే ఈ పాదయాత్రకు తగిన భద్రత కల్పించండి
- లేఖలో వివరించిన జగన్ పర్శనల్ సెక్రటరీ
ఈ నెల 6 నుంచి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావుకు జగన్ తరఫున ఆయన పర్శనల్ సెక్రటరీ ఓ లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి జగన్ పాదయాత్ర తలపెట్టారని, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని, జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ అందజేస్తామని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సుమారు ఏడు నెలల పాటు జరిగే ఈ పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డీజీపీకి విజ్ఞప్తి చేశారు.