: ధోనీపై బెంగళూరులో కేసు నమోదు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వివాదంలో చిక్కుకున్నాడు. ధోనీపై నేడు బెంగళూరు కోర్టులో కేసు నమోదైంది. ఓ వాణిజ్య ప్రకటనలో భగవంతుడి అవతారంలో ఉన్న ధోనీ ఓ చేతిలో బూటును పట్టుకుని ఉండడాన్ని అభ్యంతరకరంగా భావిస్తూ.. జయకుమార్ హీరేమాత్ అనే సామాజిక ఉద్యమకారుడు కేసు దాఖలు చేశారు. ఓ బిజినెస్ మ్యాగజైన్ లో ఈ వాణిజ్య ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ద్వారా హిందూ దేవుళ్ళ పట్ల ధోనీ తృణీకారభావం ప్రదర్శించడంతోపాటు, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించాడని జయకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై న్యాయస్థానం మే 12న విచారణ చేపట్టనుంది.