నాగచైతన్య-సమంత: హైదరాబాద్ లో చై-సామ్ ల రిసెప్షన్ ఈ నెలలోనే?
- ఈ నెల 12న రిసెప్షన్?
- ఈ తేదీన కుదరకపోతే, ఇదే నెలలో మరో రోజున రిసెప్షన్
- ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం
గత నెలలో వివాహం చేసుకున్న నాగచైతన్య-సమంతలు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నారు. గత నెల 6న గోవాలో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. నాగచైతన్య తల్లి లక్ష్మి చెన్నైలోని తన నివాసంలో ఘనంగా రిసెప్షన్ కూడా ఇచ్చారు. హైదరాబాద్ లో కూడా రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని నాడు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 12న రిసెప్షన్ జరగనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ, ఈ తేదీన రిసెప్షన్ ఇవ్వడం కుదరకపోతే, ఇదే నెలలో మరో తేదీన నిర్వహించాలని అక్కినేని కుటుంబసభ్యులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.