మంత్రి పద్మారావు: కాంగ్రెస్ లో ఉన్నన్నాళ్లూ నా సర్వస్వం కోల్పోయా: తెలంగాణ మంత్రి పద్మారావు

  • ‘కాంగ్రెస్’లోనే ఉంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టే వాడిని కాదేమో!
  • ఆ పార్టీలో ఎంత పని చేసినా ప్రోత్సాహం ఉండదు
  • ఇరవై ఏళ్ల పాటు ‘కాంగ్రెస్’లో పని చేశా
  • ఓ స్వీట్ ప్యాకెట్ తప్పా..బీ ఫారం అందుకోలేదు: పద్మారావు

 కాంగ్రెస్ పార్టీలో ఎంత పని చేసినా ప్రోత్సాహం ఉండదని, ఆ పార్టీలో ఉన్నన్నాళ్లూ తన సర్వస్వం కోల్పోయానని తెలంగాణ మంత్రి పద్మారావు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఇరవై ఏళ్ల పాటు పని చేసిన తాను ఓ స్వీట్ ప్యాకెట్ అందుకోవడం తప్పా, పార్టీ నుంచి బీ ఫారం అందుకున్న పాపాన పోలేదని అన్నారు.

గుడుంబా నిర్మూలన, పునరావాసంపై శాసనమండలిలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పద్మారావు గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడన్న విషయాన్ని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. ఇందుకు పద్మారావు స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రత్యామ్నాయ పార్టీలు లేకపోవడంతో తెలంగాణ ఉద్యమంలో చేరానని, ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికై అసెంబ్లీకి, శాసనమండలికి రాగలిగానని చెప్పిన ఆయన, తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టేవాడిని కాదేమోనని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News