చంద్రబాబు: చంద్రబాబు అమరావతికి .. రేవంత్ ఢిల్లీకి .. ఇద్దరూ పత్తా లేరు!: మంత్రి కేటీఆర్

  • రేవంత్ కు తెరచి ఉన్న ఒకే ఒక దర్వాజా ‘కాంగ్రెస్’
  • టీడీపీని అధికారంలోకి తెస్తానన్న రేవంత్ మాటలేమయ్యాయి?  
  • చంద్రబాబు, లోకేశ్ కూడా ఇదే నరుకుడు నరికారు!
  • తెలంగాణలో టీడీపీని చాపలాగా మడతపెట్టి ఎక్కడో పెట్టేశారు
  • విరుచుకుపడ్డ కేటీఆర్

తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు టీఆర్ ఎస్ లో చేరారు. ఈ
సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకుపోయాడు? అన్ని దర్వాజాలూ బందయ్యాయి. టీఆర్ఎస్ లోకి ఎంట్రీ లేదు. తెలుగుదేశం ఖతమైపోయింది. తెరచి ఉన్న ఒకే ఒక దర్వాజా కాంగ్రెస్ పార్టీ..

అందులోకి పోయిన రేవంత్, ఇవాళ పెద్ద పెద్ద మాటలు, డైలాగ్స్ చెబుతూ బిల్డప్ ఇస్తున్నాడు. మాకు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, వాళ్ల నాటకాలు కొత్త కాదు. ‘తెలుగుదేశాన్ని నేనే అధికారంలోకి తీసుకొస్తా, నేనే ముఖ్యమంత్రిని అవుతా’ అని కొడంగల్ లో రేవంత్ నాడు చెప్పుకున్నాడు. మరీ, ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? చంద్రబాబునాయుడు, లోకేశ్ నాయుడు, రేవంత్ రెడ్డి ఇదే నరుకుడు నరికారు. ఇప్పుడేమైంది? చంద్రబాబునాయుడు అమరావతికి వెళ్లిపోయాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఇద్దరూ పత్తా లేరు! తెలుగుదేశం పార్టీని చాపలాగా మడతపెట్టి ఎక్కడో పెట్టేశారు. అటువంటి వాళ్లు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు!

సోనియా గాంధీని దెయ్యమని, రాహుల్ ని పప్పు అని విమర్శించిన రేవంత్ కు, వాళ్లు ఈ రోజున దేవతల్లాగా కనపడుతున్నారు! ఏం చేస్తాం కర్మ! అన్ని సందర్భాల్లోను కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన నాయకుడి నాయకత్వాన్ని కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని నేను మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న’ అని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News