కేటీఆర్: రాహుల్ కాదు, వాళ్ల జేజెమ్మ దిగొచ్చినా మనల్ని ఏమీ చేయలేరు: మంత్రి కేటీఆర్

  • టీఆర్ఎస్ లో చేరిన ‘కొడంగల్’ నాయకులు
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుంది
  • ఈ విషయం రేవంత్ కే కాదు సోనియాకు కూడా తెలుసు: కేటీఆర్

‘రాహుల్ గాంధీ కాదు, వాళ్ల జేజెమ్మ దిగొచ్చినా మనల్ని ఏమీ చేయలేరు’ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ రోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నాడు కేసీఆర్ చేసిన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు.

కాంగ్రెస్ నాయకులకు బాస్ లు ఢిల్లీలో ఉండొచ్చు, కానీ, టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలే బాస్ లని, వేరే వాళ్లెవరూ బాస్ లు కాదని, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో, వారికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే విషయం రేవంత్ రెడ్డికే కాదు, వాళ్ల నాయకురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా తెలుసని అన్నారు.

  • Loading...

More Telugu News