నాగార్జున: నాగార్జునతో వర్మ కొత్త సినిమా.. డేట్ ఫిక్స్ చేసిన వర్మ!
- నవంబరు 20న ముహూర్తం
- నాడు ‘శివ’ షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ చిత్రం షూటింగ్
- ఉద్వేగానికి లోనవుతున్నా: దర్శకుడు వర్మ
అక్కినేని నాగార్జునతో త్వరలో ఓ చిత్రాన్ని రూపొందిస్తానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వర్మ ఓ పోస్ట్ చేశారు. నవంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. తమ కాంబినేషన్ లో వచ్చిన నాటి ‘శివ’ చిత్రం షూటింగ్ ఎక్కడైతే జరిగిందో, అదే ప్లేస్.. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ విషయం తలచుకుంటుంటే తనకు చాలా ఉద్వేగంగా ఉందని తన పోస్ట్ లో వర్మ పేర్కొన్నారు. కాగా, వర్మ, నాగార్జున కాంబినేషన్ లో నాడు తెరకెక్కిన శివ చిత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వర్మ దర్శకత్వంలో నాడు తెరకెక్కిన ‘అంతం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల్లో నాగార్జున నటించాడు. చాలా ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కనుండటం గమనార్హం.