భూపాల్ రెడ్డి: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత భూపాల్ రెడ్డి!
- మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లిన కంచర్ల భూపాల్‌రెడ్డి
- నల్లగొండలో కీలక నేతగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో నల్గొండ టీడీపీ ముఖ్య నేత కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరులు, అనుచరులు ఈ రోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లిన కంచర్ల భూపాల్ రెడ్డి అక్కడే పార్టీ కండువా కప్పుకున్నారు. కంచర్ల భూపాల్‌రెడ్డి టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇటీవల పార్టీ నేతలపై భూపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధిష్ఠానికి కోపం తెప్పించిన విషయం తెలిసిందే.