బీజేపీ: టీఆర్ఎస్ నిర్వాకం వల్ల క్రీడామైదానాలు నిరుపయోగమయ్యాయి: బీజేపీ నేత లక్ష్మణ్

  • కొత్త సచివాలయం నిర్మించి తీరుతామనడం సబబు కాదు
  • ప్రస్తుత సచివాలయంలోనే అన్ని వసతులు కల్పించాలి
  • కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన లక్ష్మణ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో  ప్రపంచస్థాయి క్రీడా పోటీలు ఎన్నో జరిగాయని, నేడు టీఆర్ఎస్ నిర్వాకం వల్ల హైదారాబాద్ లో క్రీడామైదానాలు నిరుపయోగమయ్యాయని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ శాసనసభలో కొత్త సచివాలయం అంశంపై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బైసన్ పోలో గ్రౌండ్ లో నూతన సచివాలయం నిర్మించే వరకూ వెనక్కి తగ్గేది లేదని సీఎం కేసీఆర్ అనడం సబబు కాదని అన్నారు. అందుకు బదులుగా, ప్రస్తుత సచివాలయంలో అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News