సీనియర్ నేత వీహెచ్: కొత్త సచివాలయానికి పునాదిరాయి వేస్తే ప్రాణత్యాగానికి సిద్ధపడతా: టీ కాంగ్రెస్ నేత వీహెచ్ హెచ్చరిక
- రాష్ట్రాన్ని మింగేయాలని చూస్తున్న కేసీఆర్
- కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలి
- వీహెచ్ పిలుపు
కొత్త సచివాలయానికి పునాదిరాయి వేస్తే తాను ప్రాణత్యాగానికి సిద్ధమవుతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీలో కొత్త సచివాలయ నిర్మాణంపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని మింగేయాలని కేసీఆర్ చూస్తున్నారని, కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. రెండో టెర్మినల్ నిర్మాణం పేరిట బేగంపేట ఎయిర్ పోర్టును కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని వీహెచ్ ఆరోపించారు.