కోదండరామ్: కోదండరామ్ వద్దకు వచ్చి మద్దతు తెలిపిన ఎల్.రమణ.. భారీగా వస్తోన్న విద్యార్థులు
- కోదండరామ్ ఒక్కరోజు దీక్ష
- టీడీపీ, సీపీఎం మద్దతు
- ఉద్యోగాల నియామకాల్లో కేసీఆర్ సర్కారు జాప్యం చేస్తోందని నిరసన
తెలంగాణలో ఉద్యోగాల నియామకాల విషయంలో కేసీఆర్ సర్కారు జాప్యం చేస్తోందని, నిరసన తెలుపుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ తార్నాకలోని తన ఇంటివద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కాసేపట్లో ఆయన దీక్ష ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన వద్దకు పలువురు నేతలు వచ్చి మద్దతు తెలిపారు.
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కోదండరామ్ వద్దకు వచ్చి, ఆయన చేస్తోన్న పోరాటాన్ని కొనియాడారు. ప్రజాస్వామ్య పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా కోదండరామ్ వద్దకు వచ్చారు. కాగా, కోదండరామ్ దీక్షాస్థలి వద్దకు విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు.