కూల్ డ్రింకు: కూల్ డ్రింకులో మద్యం కలిపి విద్యార్థులతో తాగించి, డ్యాన్సులు చేయించిన సిబ్బంది!
- విజయనగరం జిల్లా చీపురు పల్లిలోని బీసీ హాస్టల్‌లో ఘటన
- తల్లిదండ్రుల ఆగ్రహం
- హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని బీసీ హాస్టల్ సిబ్బంది విద్యార్థుల పట్ల దారుణ ఘటనకు పాల్పడ్డారు. కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి హాస్టల్ లోని విద్యార్థులకు ఇచ్చి తాగించారు. దీంతో ఆ విద్యార్థులకు మత్తు ఎక్కింది. అనంతరం ఆ బాలురతో డ్యాన్సులు చేయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు వచ్చి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉంటే చదువుకోవడం లేదని హాస్టల్‌కి పంపిస్తే తమ పిల్లలను చెడగొడుతున్నారని మండిపడ్డారు. హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.