hindus: ఈ ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా గుర్తించండి: సుప్రీంకోర్టులో పిల్
- ఎనిమిది రాష్ట్రాల్లో హిందువుల సంఖ్య చాలా తక్కువ
- ఇక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది
- ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది
మన దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో నివసిస్తున్న హిందువులను మైనార్టీలుగా గుర్తించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులపై ప్రతి రోజూ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పిల్ లో పేర్కొన్నారు. ఈ పిల్ ను బీజేపీ నేత, సీనియర్ అడ్వొకేట్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ వేశారు. మైనార్టీ చట్టం 1992ను అనుసరించి ఈ ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న బలవంతపు లౌకిక వ్యవస్థ (సెక్యులర్)... మన ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని పిల్ లో పేర్కొన్నారు. మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రల్లో హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు.