మంత్రి దేవినేని: ‘అన్న వస్తున్నాడు’ కాదు ‘దొంగ వస్తున్నాడు’ అనడం కరెక్ట్ : మంత్రి దేవినేని

  • ధర్మవరంలో గంగ పూజలు నిర్వహించిన దేవినేని
  • వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు
  • జగన్ ఎన్ని కుట్రలు చేసినా ‘పోలవరం’ పూర్తి చేస్తాం
  • సాగునీరు, తాగునీరు అందించి తీరుతాం

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరం చెరువుకు ఈ రోజు గంగ పూజలు చేశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘అన్న వస్తున్నాడు’ అనే పాదయాత్ర జగన్ కు సూటుకాదని అన్నారు. ‘అన్న వస్తున్నాడు’ అనడం కన్నా ‘దొంగ వస్తున్నాడు’ అంటే కరెక్ట్ గా సరిపోతుందని విమర్శించారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని, రైతులందరికీ సాగు, తాగునీరు అందించి తీరుతామని మరోమారు దేవినేని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News