ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్: మాకు రెడ్ కార్పెట్ వెయ్యరేంటని అడిగిన మంత్రికి ఆ సమాధానం చెప్పా!: గుళ్లపల్లి నాగేశ్వరరావు

  • ‘అందరికీ రెడ్ కార్పెట్ ఎప్పుడూ వేసే ఉంటుంది. మీ ముందు దులిపి వెయ్యలేదు కాబట్టి, చూసుండరు’ అని చెప్పా
  • నా దృష్టిలో ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలి
  • నా ఫిలాసఫీ అదే: గుళ్లపల్లి

తాము ప్రత్యేక అపాయింట్ మెంట్ ద్వారా ఎవరికీ చికిత్స అందించమని, సామాన్యులు, వీఐపీలు.. అందరూ తన దృష్టిలో సమానమేమని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఏబీఎన్ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఆయన మాట్లాడుతూ, ‘మొదట్లో నన్ను చాలా మంది ‘అరోగాంట్’ అని విమర్శించారు. నేను అందరినీ మర్యాదగా చూస్తా, ఆ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ‘మేము వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వెయ్యరు!’ అని ఓసారి ఓ మంత్రిగారు అన్నారు.

‘లేదండి, అందరికీ ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేసే ఉంటుంది. అందుకనే, మీరు చూసుండరు! మీ ముందు దులిపి వెయ్యలేదు కాబట్టి, చూసుండరు’ అని నేను అన్నాను. మా ఫిలాసఫీ ఏంటంటే .. మారుమూల ప్రాంతం నుంచి వచ్చే అతి పేదవాడిని కూడా గౌరవంతో చూడాలనేది మా తత్వం. అందుకని, మేము అందరినీ మర్యాదగా చూస్తాం..ఎవరినీ కించపరచం. నేను పర్సనల్ గా చూడడమనేది సాధ్యం కాదు. ఎందుకంటే, నేను మీ చుట్టూ తిరుగుతున్నానంటే, ఇంకేదో పని మానేస్తున్నానని అర్థం. ఆ పద్ధతి అవతలి వాళ్లకు, నాకు మంచిది కాదు. అంతేతప్పా, అగౌరవంగా చూడటం కాదు. నా దృష్టిలో ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలి’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News