‘కాంగ్రెస్’: ‘కాంగ్రెస్’ లో నేను అద్వానీ అంతటి వాడిని: జానారెడ్డి
- తెలంగాణ సీఎల్పీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
- నేను సీఎం పదవి అడగను..అందరూ కోరితే ఈ పదవి చేపడతా
- పార్టీలో చేరగానే ఎవరూ బాహుబలి కారు
- శక్తిసామర్థ్యాలు నిరూపించుకుంటే బాహుబలిగా నిలుస్తారు
కాంగ్రెస్ పార్టీలో తాను అద్వానీ అంతటి వాడినని తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘నేను సీఎం పదవి అడగను..అందరూ కోరుకుంటే కనుక ఈ పదవి చేపడతా. గెలిచిన వాడే బాహుబలి అవుతాడు. అంతే తప్పా పార్టీలో చేరగానే ఎవరూ బాహుబలి కారు. శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటేనే బాహుబలిగా నిలుస్తారు’ అని జానారెడ్డి తన దైన శైలిలో వ్యాఖ్యానించారు.
కాగా, టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 'కాంగ్రెస్ థియేటర్లో బాహుబలి రేవంత్' అంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేయడం విదితమే.