టీటీడీపీ: టీడీపీని వీడే యోచనలో మరో ఇద్దరు తెలంగాణ నాయకులు?

  • క్రియాశీలక రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉంటున్న మండవ
  • ఆయన నివాసంలో టీడీపీ నేతల భేటీ
  • హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణ, అరికెల నర్సారెడ్డి

టీటీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మరో ఇద్దరు నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉంటున్న మండవ వెంకటేశ్వరరావు తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించే నిమిత్తం తన అనుచరులు, ఇతర నేతలతో సమావేశమైనట్టు సమాచారం.

డిచ్ పల్లి మండలం ధర్మవరంలోని తన నివాసంలో టీడీపీ నేతల భేటీ జరిగింది. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మరో నాయకుడు అరికెల నర్సారెడ్డి హాజరయ్యారు. అరికెల నర్సారెడ్డి పార్టీ మారతారనే వార్తలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. కాగా, టీటీడీపీ నుంచి బయటకు వచ్చేసిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండవ వెంకటేశ్వరరావు నిర్వహించిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News