‘పోలవరం’: ‘పోలవరం’ పనులపై స్పందించిన ఎంపీ రాయపాటి

  • ట్రాన్స్ ట్రాయ్ కు భూములు అప్పగించే విషయంలో ఆలస్యం 
  •  అందువల్లే పనుల్లో జాప్యం 
  • 2019 నాటికి ‘పోలవరం’ పూర్తి
  • మీడియాతో ఎంపీ రాయపాటి

పోలవరం ప్రాజెక్టు పనులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని, ఈ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకే ట్రాన్స్ ట్రాయ్ నుంచి పనులు సర్దుబాటు చేశారని చెప్పారు. ట్రాన్స్ ట్రాయ్ కు భూములను ఆలస్యంగా అప్పగించారని, అందువల్లే పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. ‘పోలవరం’ ను వేగంగా పూర్తి చేసేందుకే పనులను మిగతా కంపెనీలకు సర్దుబాటు చేశారని, నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాయపాటి చెప్పారు.

  • Loading...

More Telugu News