చంద్రబాబు: చంద్రబాబులో మానవీయ కోణం అప్పుడు చూశా!: వై.సాయిబాబు

  • ‘మా అమ్మాయికి పెళ్లి  చెయ్యబోతున్నా..ఇబ్బందిగా ఉంది’ అని  ఎంతో మంది వాపోయారు
  • వారిలో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
  • అడిగిన వాళ్లందరికి బాబు సాయం అందింది
  • ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు సన్నిహితుడు సాయిబాబు

ఏపీ సీఎం చంద్రబాబులో మానవీయ కోణం గురించి ఆయన సన్నిహితుడు వై.సాయిబాబు ప్రస్తావించారు. ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మా అమ్మాయికి పెళ్లి  చెయ్యబోతున్నా..ఇబ్బందిగా ఉంది’ అని చంద్రబాబుతో చెప్పిన వాళ్లలో ఎంతో మంది మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లందరికీ ఆయన ఎంతో సాయం చేసిన రోజులు చూశాను. ఇంకా, అనేక సందర్భాల్లో ఆయనలో ఉన్న మానవీయకోణం చూశాను’ అని అన్నారు.

చంద్రబాబు పాలనపై వస్తున్న విమర్శల విషయమై సాయిబాబును ప్రశ్నించగా, ‘ప్రస్తుతానికి, 2004 కంటే ముందు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు,విమర్శలు ప్రతి విమర్శలకు చాలా తేడా ఉంది. సామాజిక మాధ్యమాలు లేదా ఇతర మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రతి ఒక్కరూ వ్యక్తి స్వేచ్ఛను కనబరుస్తున్నారు.. అప్రమత్తత, అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలి, ప్రజలను చైతన్య పరచడం మొదలైన లక్ష్యాలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. మంచితనంతో అందరినీ దగ్గర చేసుకోవాలనే పద్ధతిలోకి ఆయన మారారు’ అని సాయిబాబు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News