చంద్రబాబు: మానవ సంబంధాలకు చంద్రబాబు తక్కువ ప్రాధాన్యతనిస్తారనేది అవాస్తవం!: వై.సాయిబాబు
- చంద్రబాబుకు టీ తాగాలనిపిస్తే తనతో ఉన్న అందరికీ తెమ్మంటారు
- ప్రతి ఒక్కరికి దగ్గరయ్యేందుకే బాబు ప్రయత్నిస్తారు
- ‘వీళ్లేంటి’ అనే భావన బాబుకు ఉండదు
- ఓ ఇంటర్వ్యూలో సాయిబాబు
మానవ సంబంధాలకు చంద్రబాబు తక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విషయం అవాస్తవమని బాబు సన్నిహితుడు వై.సాయిబాబు అన్నారు. చంద్రబాబులో ఎన్నో గొప్ప గుణాలను చాలా దగ్గరగా చూశానని, వాటిని అలవరచుకోవాలనే ఉద్దేశం తనకు కలిగిందని ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
‘చంద్రబాబు వ్యక్తిగతంగా చాలా అనుబంధం కలిగి ఉంటారు. ఎందుకంటే, 2008 నుంచి ఆయన ఎంత అటాచ్ మెంట్ తో ఉంటారనే విషయం నాకు తెలుసు.. ప్రత్యక్ష అనుభవం ఉంది. ఎప్పుడన్నా కామన్ హాల్ లో అందరం కలిసినప్పుడు..ఆయన (చంద్రబాబు)కు టీ తాగాలనిపిస్తే, తనకొక్కరికే టీ తీసుకురమ్మనమని ఆయన ఎప్పుడూ అనలేదు. అక్కడ ఉన్న అందరికీ టీ తీసుకురమ్మనమని ఆయన చెప్పేవారు. ఒకవేళ భోజనం సమయం అయితే, అందరికీ భోజనం తెప్పించమంటారు. గత పది సంవత్సరాలుగా ఆయన్ని దగ్గరగా చూసిన మనిషిగా చెబుతున్నా.. వ్యక్తిగతంగా దగ్గరగా ఉండేందుకే ఆయన ప్రయత్నిస్తుంటారు. ‘వీళ్లేంటి’ అనే భావన ఆయనకు ఉండదు’ అని అన్నారు.