చంద్రబాబు: అప్పుడు చంద్రబాబుకు ఓ దోశో, ఓ ఆమ్లెట్టో ఒకటే మిగిలింది!: వై.సాయిబాబు

  • నాడు ఢిల్లీ గెస్ట్ హౌస్ లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్న సాయిబాబు
  • చంద్రబాబు టిఫిన్ ప్లేట్ ను చౌతాలాకు ఇచ్చారు 
  • మరో ప్లేట్ హరికృష్ణకు, ఇంకో ప్లేట్ నామా నాగేశ్వరరావుకు 

వ్యక్తిగత జీవితంలో ఆయా వ్యక్తులతో చంద్రబాబునాయుడు ఎంత ఆప్యాయంగా, ఎంత సంస్కారవంతంగా ఉంటారనే విషయాన్ని ఆయన సన్నిహితుడు వై.సాయిబాబు ప్రస్తావించారు. ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాడు జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించారు. ‘అఖిలపక్ష నేతలను కలిసేందుకు గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లాం. ఓ ప్లేస్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో మేము ఉన్నాం. సార్ (చంద్రబాబు) మరో ప్లేస్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఉదయాన్నే మేము ఆయన దగ్గరకు వెళ్లాం.

అదే సమయంలో ఆయన బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు  సిద్ధమవుతున్నారు. ఆయన ప్లేట్ లో ఆయనే కావాల్సిన ఐటెమ్స్ పెట్టుకుంటున్నారు. కరెక్టుగా, అప్పుడే, చౌతాలా వచ్చారు. సార్ తన చేతిలో ఉన్న ప్లేట్ ని ‘తినండి’ అంటూ చౌతాలాకు ఇచ్చేశారు. వెంటనే, మేము లేచి మరో ప్లేట్ లో టిఫిన్ పెట్టి ఇద్దామనుకుంటుండగా, ‘లేదు లేదు మీరు కూర్చోండి. నేను తీసుకుంటా’ అని సార్ అన్నారు.

తర్వాత సార్ మరో ప్లేట్ లో టిఫిన్ పెట్టుకుంటుంటే..హరికృష్ణ గారు వచ్చారు. ఆ ప్లేట్ ను ఆయనకు ఇచ్చేశారు. సార్ ఇంకో ప్లేట్ లో టిఫిన్ పెట్టుకుంటే ఈలోగా నామా నాగేశ్వరరావు వచ్చారు. మళ్లీ, ఆ ప్లేట్ ని ఆయనకు ఇచ్చేశారు. చివరకు, ఓ దోశో ఓ ఆమ్లెట్టో ..ఒకటే మిగిలింది. వేరే ఆర్డర్ చేస్తామంటే.. ‘వద్దు..నాకు చాలమ్మ’ అని చంద్రబాబు అన్నారు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయా వ్యక్తులతో అనుబంధం ఎలా ఉంటుందనే విషయాన్ని నేను కొంత గమనించాను. అప్పటి నుంచి, ఇలాంటి బిహేవియర్ ని నేను ఎందుకు అలవరచుకోకూడదని అనుకున్నా’ అంటూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News