ఉపాసన: జడలబర్రెపై కూర్చున్న రామ్ చరణ్.. నడిపించుకుంటూ వెళ్తున్న ఉపాసన!
- ఫొటోలను పోస్ట్ చేసిన ఉపాసన
- జడల బర్రెపై అటో కాలు ఇటో కాలేసి కూర్చున్న చెర్రీ
- బాగున్నాయంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఓ ఆసక్తికర ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. జడల బర్రెపై అటో కాలు ఇటో కాలు వేసి రామ్ చరణ్ కూర్చుని ఉండగా, దానిని నడిపించుకుంటూ ఉపాసన వెళ్తుండటం ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా రెండు ఫొటోలను ఉపాసన పోస్ట్ చేశారు.
అయితే, వాళ్లిద్దరూ ఏ ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ఫొటోలు దిగారో ఉపాసన పేర్కొనలేదు. కాగా, ఈ ఫొటోలు నెటిజన్లకు బాగా నచ్చడంతో ప్రశంసలు కురిపించారు. ‘మెగాపవర్ స్టార్ తో ఎంజాయ్ చేయండి’, ‘లవ్ల్ లీ కపుల్’, ‘వావ్, అరుదైన జ్ఞాపకం’, ‘నైస్ పిక్’, ‘సూపర్’ అని నెటిజన్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు.