పోలవరం: కమీషన్ల కక్కుర్తిలో ‘పోలవరం’ నలిగిపోతోంది!: రఘువీరారెడ్డి

  • సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన రఘువీరా
  • ‘నిధులు తెప్పించుకోలేని దద్దమ్మ’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • ‘పోలవరం’ నిర్మాణం చేతకాకపోతే పదవి నుంచి బాబు తప్పుకోవాలి
  • 19 తేదీ లోపు స్పష్టత ఇవ్వకపోతే దీక్ష చేస్తామన్న కాంగ్రెస్ నేత

‘పోలవరం’ విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, కమీషన్ల కక్కుర్తిలో ఈ ప్రాజెక్ట్ నలిగిపోతోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ ను చంద్రబాబు పూర్తి చెయ్యలేరని ముందు నుంచే చెబుతున్నామని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. మూడేళ్ల నుంచి పోలవరం ప్రాజెక్ట్ కు కనీస నిధులు తెచ్చుకోలేని దద్దమ్మ చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

 రాష్ట్ర ఖజనా నుంచి ఈ ప్రాజెక్ట్ కు నిధుల కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి వీల్లేదని, నిధులన్నీ కేంద్రం నుంచే తెప్పించుకోవాలని అన్నారు. ‘పోలవరం’ నిర్మాణం చంద్రబాబుకు చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని, ఈ అంశంపై వచ్చే నెల 19వ తేదీలోపు స్పష్టత ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ వద్దే దీక్ష చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News