వెంకయ్యనాయుడు: ఎంతో వినయంతో ఉండే వ్యక్తిని కలిశా: మంత్రి భూమా అఖిలప్రియ

  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన అఖిలప్రియ
  • ఆయన మాటలు నాలో మరింత విశ్వాసాన్ని నింపాయి
  • మా నాన్న సంతోషించి, గర్వపడి ఉంటారు
  • ఓ ట్వీట్ లో అఖిలప్రియ

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఏపీ యువ మహిళా మంత్రి భూమా అఖిల ప్రియ ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఆమె సత్కరించారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

‘ఎంతో వినయంతో ఉండే వ్యక్తిని నేను కలిశాను. ప్రేమపూర్వకంగా, ఉత్తేజాన్ని ఇచ్చే ఆయన మాటలు నాలో మరింత విశ్వాసాన్ని నింపాయి. మా నాన్న ఎంతో సంతోషించి, గర్వపడి ఉంటారు’ అని అఖిలప్రియ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, వెంకయ్యనాయుడిని ఏ సందర్భంలో, ఎక్కడ కలిసిన విషయాన్ని తన ట్వీట్ లో అఖిలప్రియ ప్రస్తావించక పోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News