పరుచూరి గోపాలకృష్ణ: ’అన్నగారి అరుదైన జ్ఞాపకం!’ అంటున్న పరుచూరి గోపాలకృష్ణ
- ఎన్టీఆర్ నాటి ఫొటో ను పోస్ట్ చేసిన పరుచూరి
- గ్రాడ్యుయేషన్ మిత్రులతో కలిసి ఎన్టీఆర్ దిగిన ఫొటో
- అరుదైన జ్ఞాపకంగా అభివర్ణించిన గోపాలకృష్ణ
ఎన్టీఆర్ అంటే పరుచూరి బ్రదర్స్ కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు సందర్భాల్లో ఎన్టీఆర్ తో తమకు ఉన్న ఆత్మీయతను వారు ప్రస్తావించేవారు. పరుచూరి గోపాలకృష్ణ తాజాగా చేసిన ట్వీట్ లో ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్ చేశారు.
‘అన్నగారి అరుదైన జ్ఞాపకం’ పేరిట ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన సందర్భంలో తన మిత్రులతో కలిసి దిగిన ఫొటో ఇది! ఈ ఫొటోలో ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని ఉండగా, ఆయన మిత్రులు చెరో వైపు నిలబడి ఉన్నారు.