కాన్పూర్: కాన్పూర్ వన్డేలో భారత్ విజయం... సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా!

  • మూడు వన్డేల సిరీస్ లో 2-1 తో టీమిండియా విజయం
  • న్యూజిలాండ్ స్కోర్ : 331/7 (50 ఓవర్లలో)
  • భారత్ స్కోర్: 337/6 

 కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో గెలుచుకుని, టీమిండియా విజేతగా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. అనంతరం 338 పరుగుల భారీ విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది. న్యూజిలాండ్ చివరి వరకు పోరాడి ఓడింది.

న్యూజిలాండ్ బ్యాటింగ్ : గప్తిల్ (10), మున్రో (75), విలియమ్ సన్ (64), టేలర్ (39), నికోలస్ (37), లాథమ్ (65), సాంత్నర్ (9), గ్రాండ్హొమ్ 8,  సౌథీ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

న్యూజిలాండ్ స్కోర్ : 331/7 (50 ఓవర్లలో)

భారత్ బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ -1, బుమ్రా - 3, చాహల్ - 2

భారత్ స్కోర్ : 337/6 (50 ఓవర్లలో)

  • Loading...

More Telugu News