ఫ్రెంచ్ ఓపెన్: ఫ్రెంచ్ ఓపెన్ విజేత కిడాంబి శ్రీకాంత్.. అభినందనల వెల్లువ!
- జపాన్ క్రీడాకారుడితో తలపడ్డ శ్రీకాంత్
- 21-14, 21-13 తేడాతో విజయం
- నరసింహన్, చంద్రబాబు అభినందనలు
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచి, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్స్ లో జపాన్ క్రీడాకారుడు కెంటా నిషిమోటోతో తలపడ్డ శ్రీకాంత్ 21-14, 21-13 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో వరుసగా రెండోసారి టోర్నీని శ్రీకాంత్ సాధించినట్టయింది.
ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్పందిస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రీకాంత్ కి తన అభినందనలు తెలియజేశారు. శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించాలని నరసింహన్ ఆకాంక్షించారు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, శ్రీకాంత్ కు అభినందనలు తెలిపారు.