గవర్నర్: గవర్నర్ కుర్చీలో ఓ బాలుడు.. స్వయంగా కూర్చోబెట్టిన కిరణ్ బేడి!

  • కిరణ్ బేడీ కార్యాలయానికి వెళ్లిన ఓ కుటుంబం
  • ఆప్యాయంగా పలకరించిన బేడీ
  • లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డ చిన్నారి

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అధికారిక నివాసం సందర్శనకు వెళ్లిన పదకొండేళ్ల బాలుడికి అరుదైన గౌరవం లభించింది. ఆ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి గవర్నర్ అధికారిక నివాసం రాజ్ నివాస్ సందర్శనకు వెళ్లాడు. అయితే, ఆ సమయంలో కిరణ్ బేడీ తన కార్యాలయంలో ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న బాలుడి కుటుంబం అక్కడికి వెళ్లారు. బాలుడి కుటుంబసభ్యులతో ప్రేమగా మాట్లాడిన కిరణ్ బేడీ, ఆ బాలుడిని ఆప్యాయంగా పలకరించారు.

అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఉబ్బితబ్బిబ్బయిన ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు. ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ‘సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతాను. దీని ద్వారా వాళ్లు స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?’ అని ఆ ట్వీట్ లో స్ఫూర్తిదాయక ట్వీట్ ను బేడీ చేశారు.

  • Loading...

More Telugu News