న్యూజిలాండ్: మూడో వన్డే.. పరుగుల వర్షం కురిపిస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు!

  • మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
  • చెలరేగి ఆడిన మున్రో , విలియమ్ సన్ 
  • 30 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 175/3

మూడో వన్డేలో భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు పరుగుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంజె గప్తిల్, మున్రో, విలియమ్ సన్ వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. మున్రో, విలియమ్ సన్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. గప్తిల్ పది పరుగులకే ఔట్ అయ్యాడు.

మున్రో (75), విలియమ్ సన్ (64) భాగస్వామ్యం పటిష్టంగా కొనసాగడంతో స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. ఆ తర్వాత మున్రో ఔట్ అయిన కొంచెం సేపటికే విలియమ్ సన్ పెవిలియన్ ముఖం పట్టాడు. మున్రో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా, విలియమ్ సన్ ఎనిమిది ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజ్ లో టేలర్, లాథమ్ కొనసాగుతున్నారు. 30 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 175/3.

  • Loading...

More Telugu News