టీపీసీసీ చీఫ్ ఉత్తమ్: రానున్న పది రోజుల్లో ‘కాంగ్రెస్’లో భారీ చేరికలు: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- 2019లో అధికారం మాదే
- టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి
- వచ్చే నెలలో వరంగల్ లో రాహుల్ పర్యటన
- పాత్రికేయులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి
రానున్న పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే నెలలో వరంగల్ లో పర్యటించనున్నారని చెప్పారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, టీఆర్ఎస్ పాలన కంటే గత కాంగ్రెస్ పాలనే మేలని ప్రజలు అనుకుంటున్నారని, త్వరలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని అన్నారు.