అశుతోష్ రాణా: యువతకు నేను చెప్పేది ఒక్కటే!: నటుడు అశుతోష్ రాణా
- ప్రతి మనిషిలోనూ కళ ఉంటుంది
- యువత వినయంగా పని చేయాలి
- యువత గుర్తుపెట్టుకోవాల్సింది పట్టుదల, వినయం, సామర్థ్యం
- ఓ ఇంటర్వ్యూలో అశుతోష్ రాణా
‘యువత ఏదైనా పని చేయాలి అనుకుంటే వినయంతో చేయండి లేదా వినయంతో చేయాలనే పట్టుదలను తెచ్చుకోండి’ అని ప్రముఖ సినీ నటుడు అశుతోష్ రాణా అన్నాడు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు తెలిసినంత వరకు ప్రతి మనిషిలోనూ నటుడు ఉంటాడని, నటుడు డాక్టర్ గా నటించగలడు కానీ, ఆ వృత్తిని చేయలేడని, అందువల్ల కళ అనేది ప్రతి మనిషి లో ఉంటుందని, అదే అతని స్వభావం అవుతుందని అన్నారు.
డాక్టర్ కావాలనో, ఆర్టిస్ట్ కావాలనో ఆశ యువతలో ఉండటంలో తప్పులేదు కానీ, యువత గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు పట్టుదల, వినయం, సామర్థ్యం అని అన్నారు. ‘పట్టుదలతో ఏదైనా పని చేస్తే అందులో వినయం ఉంటుంది. వినయం ఉన్న చోట ఆశ పెరుగుతుంది. అయితే, ఒకోసారి మనం ఎంత చేసినా ఓటమిపాలైతే అసంతృప్తితో ఉంటాం. ఓడిపోయినా పట్టించుకోకూడదు. పట్టుదలగా ఉండాలి. అప్పుడు, మనం చేసే పనిలో ఆనందం పొందుతాం. ఓడిపోతాం అనే బాధ ఉండదు’ అని చెప్పుకొచ్చారు.