రేవంత్ రెడ్డి: రేవంత్ రెడ్డి ‘ఆత్మీయ సమావేశానికి’ పోలీసుల అనుమతి నిరాకరణ!
- జలవిహార్ లో రేపు తలపెట్టిన ఆత్మీయ సమావేశం
- అనుమతి నిరాకరించిన పోలీసులు
- జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటి వద్దే సమావేశం
- అభిమానులు, అనుచరులు, కార్యకర్తలకు అక్కడికే రావాలని రేవంత్ పిలుపు
టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ లో తలపెట్టిన ఆత్మీయ సమావేశానికి అనుమతి లభించలేదు. జలవిహార్ లో నిర్వహించనున్న ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో, జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటి వద్దే సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు తన ఇంటి వద్దకే రావాలని ఈ నేపథ్యంలో రేవంత్ పిలుపు నిచ్చారు.