మూడో వన్డే: మూడో వన్డే: న్యూజిలాండ్ విజయ లక్ష్యం 338 పరుగులు

  • నిర్ణీత 50 ఓవర్లలో భారత్ స్కోర్: 337/6
  • చివరి ఓవర్ చివరి బంతికి ఔటైన జాదవ్
  • చెరో సెంచరీ చేసిన రోహిత్, కోహ్లీ

కాన్పూర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయలక్ష్యం 338 పరుగులుగా టీమిండియా నిర్దేశించింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. 50వ ఓవర్ లో మిల్న్ వేసిన చివరి బంతిని కొట్టిన  జాదవ్ (18)..గప్తిల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

భారత్ బ్యాటింగ్ : రోహిత్ శర్మ (147), శిఖర్ ధావన్ (14), కోహ్లీ (113), పాండ్యా (8), ధోనీ (25), జాదవ్ (18), కార్తీక్ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

భారత్ స్కోర్: 337/6

న్యూజిలాండ్ బౌలింగ్ : టీజీ సౌథీ - 2, ఏఎఫ్ మిల్న్ - 2, ఎంజె సాంత్నర్ - 2

  • Loading...

More Telugu News