ఎన్టీఆర్: మంత్రి గంటాకు మేకప్ వేసుకోవడానికే టైం సరిపోదు.. !: వైసీపీ నేత లక్ష్మీపార్వతి

  • విద్యార్థుల సమస్యలను గంటా ఏం పట్టించుకుంటారు?
  • ఎయిడెడ్ కాలేజీల్లో ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వం
  • ‘ఎయిడెడ్’ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామన్న హామీ ఏమైంది?
  •  ప్రశ్నించిన లక్ష్మీపార్వతి

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటాకు మేకప్ వేసుకోవడానికే టైం సరిపోదని, ఇక విద్యార్థుల సమస్యలను  ఏం పట్టించుకుంటారంటూ మండిపడ్డారు. విజయవాడలో జరిగిన ఎయిడెడ్ కాలేజీల్లోని అధ్యాపకుల సంఘం సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎయిడెడ్ కాలేజీల్లో ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కాంట్రాక్టు లెక్చరర్లకి ఇస్తున్న జీతంలో సగంలో కూడా ఎయిడెడ్ కాలేజీల్లోని టెంపరరీ ఉద్యోగులకు ఇవ్వడం లేదని అన్నారు. ఎయిడెడ్ కాలేజీల్లోని అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామన్న హామీని ప్రభుత్వం మరిచిందని, అధ్యాపకుల సమస్యలపై వైసీపీ తరపున పోరాడతామని అన్నారు. 

  • Loading...

More Telugu News