యూపీలో: యూపీలో దారుణం.. మంత్రి కాన్వాయ్ ఢీకొట్టడంతో బాలుడి మృతి

  • సీనియర్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్ భర్ కాన్వాయ్ కి బాలుడు బలి
  • గోండా జిల్లాలో సంఘటన
  • మండిపడుతున్న గ్రామస్తులు

యూపీలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని సీనియర్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్ భర్ కాన్వాయ్ ఢీకొట్టింది. గోండా జిల్లాలో నిన్నరాత్రి జరిగిన ఈ సంఘటనలో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, ఈ సంఘటనపై మండిపడ్డ  గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు చోట్ల నిప్పు పెట్టారు. చనిపోయిన బాలుడి తండ్రి విశ్వనాథ్ మాట్లాడుతూ, తన బిడ్డను మంత్రి కాన్వాయ్ లోని కారు ఢీ కొట్టిందని, కనీసం, తమ కారును ఆపకుండా మంత్రి వెళ్లిపోయారని వాపోయాడు. ఇదిలా ఉండగా, ఈ సంఘటనపై విచారణకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. బాలుడి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

 అయితే, ఈ సంఘటనపై మంత్రి ఓం ప్రకాశ్ రాజ్ భర్ స్పందిస్తూ, తన కాన్వాయ్ కారణంగా బాలుడు చనిపోయినట్టు తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన అనంతరం సంఘటనా స్థలానికి వెళదామనుకున్నా కానీ, గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారని అక్కడికి వెళ్లవద్దని పోలీసులు వారించారని అన్నారు.

  • Loading...

More Telugu News