రజనీకాంత్: రాజకీయాల్లోకి రావాలంటే పేరు, హోదా ఉంటే చాలదు: రజనీకాంత్
- అంతకంటే ఎక్కువ అర్హతలు ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి
- తీరని కోరిక ఒకటి ఉంది.. ఏం జరుగుతుందో చూడాలి
- తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్
రాజకీయాల్లోకి రావాలంటే పేరు, హోదా ఉంటే చాలదని, అంతకంటే ఎక్కువ అర్హతలే ఉండాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ప్రముఖ నటుడు కమలహాసన్ తన సొంత పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రజనీ పైవిధంగా స్పందించారు.
కాగా, ‘రోబో 2.0’ ఆడియో వేడుక రెండు రోజుల క్రితం దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన విషయం విదితమే. ‘తీరని కోరిక ఒకటి ఉంది., ఏం జరుగుతుందో చూడాలి’ అని ఈ వేడుకలో పాల్గొన్న రజనీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి తన రంగప్రవేశం గురించి రజనీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చిత్రవర్గాలు భావిస్తున్నాయి.