చంద్రబాబు: తెలంగాణ టీడీపీ నేత భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • కొంతమంది సీనియర్లే  రేవంత్ ను బయటకు పంపేశారు
  • రేవంత్ పార్టీ వీడుతున్నారని తెలిసి చంద్రబాబు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నా
  • కాంగ్రెస్ లో కూడా రేవంత్ హీరోగా ఉంటారు: భూపాల్ రెడ్డి

టీటీడీపీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని కొంతమంది సీనియర్లు పార్టీ నుంచి పంపేశారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ సంక్షోభానికి కారణమైన వ్యక్తే ఇప్పుడు పార్టీ నుంచి రేవంత్ బయటకు వెళ్లడానికి కారణమని అన్నారు. పార్టీ నుంచి రేవంత్ వెళ్తున్నారని తెలిసి విజయవాడలో నిర్వహించిన టీటీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది టీడీపీని వీడనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ హీరోగా ఉంటారని, తాను కూడా నియోజకవర్గ ప్రజలతో చర్చించి రేవంత్ వెంట వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News