కేటీఆర్: పెళ్లయిన మగవాళ్లు ఈ జోక్ చూస్తే నవ్వుకోవాల్సిందే: మంత్రి కేటీఆర్

  • ‘ట్విట్టర్’లో ఓ పోస్ట్ ను షేర్ చేసిన కేటీఆర్
  • ఈ పోస్ట్ ను తప్పుగానో, నేరంగానో పరిగణించొద్దని మహిళలకు వినతి
  • ఓ భక్తుడికి ఓ బాబా చెప్పిన సమాధానం ఇదీ!

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ జోక్ ని షేర్ చేశారు. ఈ పోస్ట్ ను షేర్ చేయకుండా ఉండలేకపోయానని పేర్కొన్న కేటీఆర్,  పెళ్లయిన మగవాళ్లు కనుక ఈ పోస్ట్ ను చూస్తే చిరునవ్వు నవ్వడం ఖాయమని అన్నారు.

ఇంతకీ, ఆ జోక్ ఏంటంటే.. ఐపై బాబా వద్దకు వెళ్లిన ఓ భక్తుడు ‘గురూజీ, నా పొరపాట్లు/తప్పులను నేను ఎలా తెలుసుకోవాలి..?’ అని ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన ఐపై బాబా, ‘నీ భార్య చేసిన ఓ తప్పును గుర్తించి, అది సరిదిద్దుకోమని ఆమెకు చెప్పు. ఇందుకు ఆమె ప్రతిస్పందించడం ద్వారా నీ తప్పులతో పాటు మీ కుటుంబం, బంధువులు, నీ మిత్రుల తప్పులు కూడా  గుర్తించవచ్చు’ అని సమాధానమిచ్చినట్టు కేటీఆర్ చేసిన పోస్ట్ నవ్వు తెప్పిస్తోంది. కాగా, ఈ పోస్ట్ ను నేరంగానో, తప్పుగానో పరిగణించొద్దంటూ మహిళలకు కేటీఆర్ విన్నవించుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News