‘మెహబూబా’: గడ్డ కట్టే చలిలో ‘మెహబూబా’ షూటింగ్.. వీడియో పోస్ట్ చేసిన ఛార్మి!

  • హిమాచల్ పర్వతంపై ‘మెహబూబా’ షూటింగ్
  • ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆకాశ్ పూరీ
  • ఫొటోలను పోస్ట్ చేసిన ఛార్మి
  • 18 వేల అడుగుల ఎత్తులో, - 7 డిగ్రీల వాతావరణంలో మంచు కురుస్తుండగా తీసిన  వీడియో!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘మెహబూబా’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూరీ తనయుడు ఆకాశ్ పూరీ సరసన నేహాశెట్టి నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతోంది. హిమాచల్ పర్వతంపై గడ్డకట్టే చలిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ వీడియోను ఆకాశ్ పూరీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

నటి ఛార్మి కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఇదే వీడియోను, కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో చిత్రయూనిట్ సభ్యులందరూ చలి నుంచి రక్షణనిచ్చే దుస్తులు ధరించి ఉన్నారు. హిమాచల్ పర్వతంపై మంచు కురుస్తుండగా పూరీ జగన్నాథ్ సహా చిత్ర యూనిట్ సభ్యులు ‘మెహబూబా...జై మెహబూబా’ అంటూ ఈ వీడియోలో కనపడతారు.

18 వేల అడుగుల ఎత్తులో, - 7 డిగ్రీల చలిలో, మంచు కురుస్తుండగా తీసిన ఈ వీడియోలో పూరీ జగన్నాథ్ సహా యూనిట్ సభ్యులు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News