శంకర్: శంకర్ చాలా వినయంగా ఆ మాటలు నాతో చెబుతుంటారు: సంగీత దర్శకుడు రెహమాన్

  • ‘నీ నుంచే స్ఫూర్తి పొందుతుంటా’ అని శంకర్ అంటుంటారు
  • ఎంతో సరదాగా ఉండే శంకర్, పని నాణ్యత విషయంలో రాజీపడరు
  • ‘రోబో 2.0’ ఆడియో వేడుకలో రెహమాన్

‘నీ నుంచే స్ఫూర్తి పొందుతుంటా’ అని దర్శకుడు శంకర్ చాలా వినయంగా తనతో చెబుతుంటారని ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ అన్నారు. శంకర్ అంకితభావం ఎప్పటికీ తనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, శంకర్ మాత్రం ‘నీ నుంచే స్ఫూర్తి పొందుతుంటా’ అని వినయంగా చెబుతుంటారని, ఈ మాటలను తాము పరస్పరం అనుకుంటూ ఉంటామని రెహమాన్ చెప్పారు.

‘జెంటిల్ మెన్’ చిత్రం నుంచి శంకర్ తో కలిసితో పనిచేస్తున్నానని, ఆయన ఏమీ మారలేదని, ఎంతో సరదాగా ఉండే శంకర్, పని నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడరని అన్నారు. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు, ఏదైనా కొత్తగా వారికి పరిచయం చేయాలన్న దానిపైనే తమ దృష్టి ఉంటుందని రెహమాన్ చెప్పారు.

  • Loading...

More Telugu News