రోబో 2.0: దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చాలా అంశాలు నేర్చుకోవచ్చు: అక్షయ్ కుమార్
- దక్షిణాది చిత్ర పరిశ్రమ వారు ఇతరుల ప్రతిభను గౌరవిస్తారు
- రజనీతో పాటు నటించే అవకాశమిచ్చిన దర్శకుడు శంకర్ కి ధన్యవాదాలు
- బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్
దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చాలా అంశాలు నేర్చుకోవచ్చని, వారి పనితీరు ఆ విధంగా ఉంటుందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. ‘రోబో 2.0’ చిత్రం షూటింగ్ జరిగినన్ని రోజులు కొత్త విషయాలను తాను నేర్చుకుంటూనే ఉన్నానని, దక్షిణాది చిత్ర పరిశ్రమ వారు ఇతరుల ప్రతిభను గౌరవిస్తూ, అందరితో కలిసి పనిచేస్తారని ప్రశంసించారు.
ఈ చిత్రంలో రజనీటప్ పాటుగా తనకు నటించే అవకాశమిచ్చిన దర్శకుడు శంకర్ కి తన ధన్యవాదాలని చెప్పారు. కాగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రోబో 2.0’ ఆడియో వేడుక నిన్న దుబాయ్ లో ఘనంగా జరిగిన విషయం తెలసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ, హిందీ భాషల ఆడియోలు ఒకే వేదికపై విడుదల చేశారు.