రోబో 2.0: జీవితంలో ఓ దశ దాటిన తర్వాత ఆ మూడూ ఎలాంటి సంతోషాన్నీ ఇవ్వవు!: రజనీకాంత్
- డబ్బు, పేరు, కీర్తి కొంత వరకే సంతోషాన్నిస్తాయి
- సినీ కెరీర్ ప్రారంభంలో అవే సంతోషాన్నిస్తాయని భావిస్తాం
- ఆ విషయం తలచుకుంటే నవ్వొస్తోంది
- ‘రోబో 2.0’ ఆడియో వేడుకలో రజనీ
డబ్బు, పేరు, కీర్తి కొంత వరకే సంతోషాన్నిస్తాయని, జీవితంలో ఓ దశ దాటిన తర్వాత ఆ మూడూ ఎలాంటి సంతోషాన్ని ఇవ్వవని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. డబ్బు, పేరు, కీర్తి సంతోషాన్ని ఇస్తాయనే భావన కెరీర్ ఆరంభంలోనే ఉంటుందని, అవి లేకపోతే దురదృష్టంగా భావిస్తామని, ఆ విషయం తలచుకుంటే నవ్వొస్తోందని అన్నారు.
చిత్ర పరిశ్రమలో తన నటనా జీవితం చాలా త్వరగా గడిచిపోయినట్టు అనిపిస్తోందని, సినీ రంగంలోకి తాను వచ్చి నాలుగైదేళ్లయినట్టే ఉందని అన్నారు. దేవుడి దయ, అభిమానుల ఆశీస్సుల వల్లే అద్భుతమైన సినీ కెరీర్ ను పొందగలిగానని అన్నారు. మంచి చిత్రాలను, నటులను ఎప్పుడూ ప్రోత్సహించాలని చెప్పిన రజనీ, ఒక సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి టాక్ వచ్చినా, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయొద్దని దుబాయ్ లో నిర్వహించిన ‘రోబో 2.0’ చిత్ర ఆడియో వేడుకలో రజనీ కోరారు.