Ravi Teja: 'సీక్రెట్‌ సూపర్‌ స్టార్' సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన సినీ హీరో ర‌వితేజ‌!

  • బాలీవుడ్ న‌టుడు ఆమిర్‌ ఖాన్ న‌టించిన‌ 'సీక్రెట్‌ సూపర్‌ స్టార్'
  • నిజాయతీతో కూడిన గొప్ప సినిమా
  • ఈ సినిమాలో ఆర్టిస్టుల న‌ట‌న అద్భుతం
  • టాలెంట్, కఠోరశ్రమ ఉంటే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుంది

బాలీవుడ్ న‌టుడు ఆమిర్‌ ఖాన్ న‌టించిన‌ 'సీక్రెట్‌ సూపర్‌ స్టార్' సినిమాకి టాలీవుడ్ న‌టుడు ర‌వితేజ ఫిదా అయిపోయాడు. తాను 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా చూశానని, ఈ సినిమా నిజాయతీతో కూడిన గొప్ప సినిమా అని ర‌వితేజ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అన్నాడు. ఈ సినిమాలో జైరా వసీంతో పాటు ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో క‌నిపించిన వారి న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని చెప్పాడు.

దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాని ఎంతో చ‌క్క‌గా తీశాడ‌ని అన్నాడు. టాలెంట్, కఠోరశ్రమ ఉంటే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుందని కొనియాడాడు. ఇటువంటి సినిమాలు విజయాన్ని సాధిస్తాయని అన్నాడు. ర‌వితేజ తాజాగా 'రాజా ది గ్రేట్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోంది.  

More Telugu News