పరుచూరి గోపాలకృష్ణ: హీరో మీద ఈగను కూడా వాలనివ్వని దర్శకుడు రాఘవేంద్రరావు!: పరుచూరి గోపాలకృష్ణ

  • హీరో పాత్రను ఎలా సృష్టించాలో తెలుసుకున్న రచయితలు, దర్శకులు గొప్పవాళ్లయ్యారు
  • హీరో పాత్ర  సృష్టించడంలో దాసరి దిట్ట
  • ‘పరుచూరి పాఠాలు’లో గోపాలకృష్ణ

హీరో పాత్రను ఎలా సృష్టించాలనే విషయం తెలుసుకున్న రచయితలు, దర్శకులు గొప్పవాళ్లయ్యారని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పాఠాలు’లో భాగంగా ఈరోజు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘హీరో మీద ఈగ కూడా వాలనివ్వడని దర్శకుడు రాఘవేంద్రరావు గురించి మేము అనుకుంటూ ఉంటాం. అందుకే, ఆయన అంత పెద్ద దర్శకుడు అయ్యారు. హీరో పాత్రలను సృష్టించడంలో దర్శకుడు దాసరి నారాయణరావు గారు దిట్ట. వీళ్లందరూ మామూలు వాళ్లు కాదు. ఒక పాత్రను సృష్టించడానికి అద్భుతమైన మేధస్సు కావాలి. సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం నాలుగు రకాల కథానాయకులు ఉంటారు’ అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News